అందుబాటులోకి రానున్న గరిమా గృహ షెల్టర్లు!
1 min readపల్లెవెలుగువెబ్, కర్నూలు: హిజ్రాల సంక్షేమం కోసం జిల్లాలో గరిమా గృహ షెల్టర్హోంలు అందుబాటులోకి తేనున్నట్లు విభిన్నప్రతిభావంతులు, హిజ్రా, వయోవృద్దుల సంక్షేమశాఖ సహాయసంచాలకులు విజయ గురువారం వెల్లడించారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో హిజ్రాల సంక్షేమం కోసం జిల్లాలో ”గరిమా గృహ “షెల్టర్ హోమ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. నిరాశ్రయులైన హిజ్రాల సంక్షేమం, వృత్తి నైపుణ్యం , శిక్షణ, వసతి కల్పించడంలో భాగంగా “గరిమా గృహ “పేరుతో షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేసేందుకు అర్హులైన స్వచ్చంధ సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నామన్నారు. వివరాల కోసం తమ కార్యాలయం ఫోన్‌నెం. 08518– 277684 కు సంప్రదించాలని కోరారు.