సీవిల్ సర్వీసెస్ ఫలితాలు వచ్చాయ్! తెలుగువారిచే పైచేయి
1 min readపల్లెవెలుగువెబ్, ఢీల్లీ: 2020–సీవిల్ సర్వీసెస్ ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు వారే పైచేయిగా నిలవడం విశేషం. భారతదేశంలో సర్వోన్నత విద్య విధానంలోని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పోస్టులను సివిల్ సర్వీసెస్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ క్రమంలో సదరు పోస్టులకు సంబంధించి 2020–సీవిల్స్కు మొత్తం 761మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిలో మహిళలు 216మంది, పురుషులు 545మంది ఉన్నారు. కాగా జనరల్ అభ్యర్థులు 263మంది, ఓబీసీ 229 మంది, షెడ్యూల్డ్ క్యాస్ట్ 122మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరి నుంచి 86మంది ఉన్నారు. ఇందులో వందలోపు ర్యాంక్‌లు సాధించిన తెలుగువారిలో పి.శ్రీజ 20వ ర్యాంక్, మైత్రీనాయుడు 27, రవికుమార్ 84, యశ్వంత్‌రెడ్డి 93వ ర్యాంక్ సాధించారు. కాగా మొదటి ర్యాంక్ శుభంకుమార్, 2వ ర్యాంక్ జాగృతి, మూడవ ర్యాంక్ అంకితాజైన్లు ఉన్నారు.