కురువలకు.. జెడ్పీ వైస్ చైర్మన్ ఇవ్వడం హర్షణీయం
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ పదవిని ముఖ్యమంత్రి జగన్ కురవలకు కేటాయించడం హర్షణీయమని జిల్లా కురువ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ పుల్లన్న, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దేవేంద్రప్ప, ఎంకే రంగస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె శివన్న పేర్కొన్నారు. శనివారం వారు మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా కురువ జనాభ ఉందని, జనాభను ప్రాతిపదకంగా తీసుకుని జడ్పీ చైర్మన్ పదవి కురువలకు ఇవ్వాలని, అంతేకాకుండా గతంలో కాంగ్రెస్ , టీడీపీ హయాంలో కురువలకు జడ్పీ చైర్మన్ పదవులు ఇచ్చి కురువలను ఆయా పార్టీలు గుర్తించాయని, వైసీపీ తరుపున కూడ గుర్తించి జిల్లాలో అధిక సంఖ్యలో జెడ్పీటీసీ, ఏంపీటీసీలుగా కురవలు గెలుపొందారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహరెడ్డి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయగా ప్రభుత్వం జిల్లాలోని కురువలను గుర్తించి హొళగుంద జడ్పీటీసీ గా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీమతి కురువ బుజ్జమ్మకు జైడ్పీ వైస్ చైర్ పర్సన్ ఇవ్వడం గర్హనీయమన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. సమావేశంలో కల్లె లక్ష్మన్న, తిరుపాల్ , ఓ.పుల్లన్న, తవుడు శ్రీనివాసులు, వెంకటకృష్ణ పాల్గొన్నారు.