మల్లన్న సన్నిధిలో హైకోర్టు జడ్జి
1 min read
పల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు జడ్జి బి. కృష్ణమోహన్ దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఆలయ వేదపండితులు వేద ఆశీర్వచనం చేశారు. హై కోర్టు జడ్జి బి. కృష్ణమోహన్‌కు ఆలయ ఈవో లవన్న శేష వస్త్రాలు సమర్పించి..సత్కరించారు.