శ్రీశైలంలో.. స్పర్శదర్శనం..
1 min readపల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: శ్రీశైల మల్లన్న స్పర్శదర్శనంకు అభిషేక సేవాదారులతోపాటు ఇతర భక్తులకు ఆలయ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం అభిషేక సేవాదారులు మరియు విరామ దర్శన సమయంలో (వీఐపీ బ్రేక్ దర్శనం) మాత్రమే భక్తులకు స్వామివారి స్పర్శదర్శనం ఉంది. భక్తుల విన్నపం మేరకు ఈ నెల 25 నుంచి అభిషేకసేవాదారులతోపాటు ఇతర భక్తులకు అవకాశం కల్పించారు. ఇందుకు దర్శన ప్లాట్లకు అదనంగా స్వామి స్పర్శదర్శనానికి రూ. 500 రుసుము చెల్లించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. క్యూకాంప్లెక్స్ ఎదురుగా గల ఆర్జితసేవాకౌంటర్ నందు రాత్రి గం. 7.30ల నుంచి భక్తులు ఈ స్పర్శదర్శనం టికెట్లు పొందవచ్చును. ప్రతిరోజు రాత్రి గం. 9.00ల నుంచి గం. 10.00ల వరకు స్పర్శదర్శనానికి అనుమతించారు. కాగా స్వామివారి స్పర్శదర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించి, కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆలయ కార్యనిర్వహణాధికారి లవన్న కోరారు.