ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి
1 min readపల్లెవెలుగు. నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలో రాయలసీమ బిజెపి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్వగృహంలో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శభరి ఆదేశాల మేరకు శనివారం బీజేపీ నందికొట్కూరు టౌన్ ప్రెసిడెంట్ గూడూరు రవి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
కార్యక్రమానికి నందికొట్కూర్ అసెంబ్లీ ఇంచార్జ్ కొండే పోగు చిన్న సుంకన్న, నంద్యాల పార్లమెంటు భారతీయ జనతా యువమోర్చా జిల్లా నాయకులు శివప్రసాద్ రెడ్డి లు హాజరయ్యారు. అనంతరం నందికొట్కూరు టౌన్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టి పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో వృద్దులకు పండ్లు , బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బి. సురేష్ , భార్గవ రాముడు , మోహన్ కుమార్ , సాయి మహేష్ , అశ్విన్ కుమార్,గుంజేపల్లె ఎల్లారెడ్డి, ఖలీల్ , హుస్సేన్, మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు బైరెడ్డి అభిమానులు పాల్గొన్నారు.