PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోవిడ్​ వ్యాక్సిన్​ హబ్​గా ఇండియా! ఐరాసలో ప్రధానిమోడీ

1 min read

పల్లెవెలుగువెబ్​, న్యూయార్క్​: ప్రపంచదేశాల్లో భారతదేశం కోవిడ్​ వ్యాక్సిన్​ హబ్​గా నిలిచిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. శనివారం ఆయన న్యూయార్క్​లో జరిగిన ఐక్యరాజ్యసమితీ సమావేశాల్లో ప్రసంగించారు. కరోనాతో యావత్​ ప్రపంచం ఆపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు. ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్​ను త్వరలో అందుబాటులోకి తేస్తామన్నారు. ఎంఆర్​ఎన్​ఏ ఈ టీకా తయారీ చివరీ దశలో ఉందన్నారు. 12ఏళ్లు నిండిన చిన్నారుల కోసం ఇండియా డీఎన్​ఏ టీకాను తయారు చేసిందని పేర్కొన్నారు. డీఎన్​ఏ టీకా తయారు చేసిన దేశం భారత్​ అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ దేశంలో 3కోట్ల మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చామన్నారు. భారతదేశంలో జరిగుతోన్న పరిశోధనలు ప్రపంచానికి ఎంతో వినియోగపడుతున్నాయని, ఇండియా అభివృద్ధితో ప్రపంచ వృద్ధిరేటు వేగంగా పెరుగుతుందని మోడీ వెల్లడించారు. భారత్​లో అనేక డిజిటల్​ విధానాలను ప్రవేశపెట్టామని తెలిపారు. ఆఫ్ఘన్​లో నెలకొన్న భయానక పరిస్థితులను మోడీ ప్రస్తావిస్తూ అక్కడి ప్రజలకు ప్రపంచ దేశాలు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

About Author