విజయవాడకు తరలిన టైలర్లు
1 min readపల్లెవెలుగువెబ్, పత్తికొండ : విజయవాడ కళాక్షేత్రంలో ఈ నెల 26న జరుగు టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బోర్డు చైర్మెన్ ప్రమాణస్వీకారానికి శనివారం పత్తికొండ నుండి పెద్ద ఎత్తున టైలర్స్ తరలి వెళ్లారు. టైలర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ను ఏర్పాటు చేసింది. అలాగే టైలర్స్ వెల్ఫేర్ బోర్డు కు నూతన కమిటీ చైర్మన్ గా షేక్ సుభాని ని ఎంపిక చేసింది. ఈ మేరకు ఆదివారం విజయవాడ కళాక్షేత్రంలో నూతన వెల్ఫేర్ బోర్డు కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పత్తికొండ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున టైలర్లు బస్సులో బయల్దేరారు. ఈ సందర్భంగా టైలర్ అసోసియేషన్ నాయకులు వెంకటేశ్వర రెడ్డి తిక్క స్వామి చుక్క ప్ప మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా దర్జీల బతుకుల బాగుకోసం ఉద్యమాలు చేశామని అన్నారు. ఇంతకాలం చేసిన పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి టైలర్స్ సంక్షేమం కోసం నూతన వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసిందని వారు హర్షం వ్యక్తం చేశారు. టైలర్స్ కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని, విద్యా వైద్య ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు కోరారు.