112 వార్డు వాలంటీర్ల పోస్టులకు 29న ఇంటర్వ్యూ…
1 min read
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు నగర పాలక కార్యాలయంలో 112 వార్డు వాలంటీర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కర్నూలు నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నగరంలోని వార్డు సచివాలయాల పరిధిలో 100 ఇళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే వార్డు వాలంటీర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఇంటర్వ్యూలకు మొత్తం 479 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ ఇంటర్వ్యూల నిర్వహణకు కమిటీకి ముగ్గురు చొప్పున మొత్తం 8 కమిటీలతో కూడిన అధికారులను నియమించినట్లు కమిషనర్ వివరించారు.