బద్వేల్ వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సుధా! ప్రకటించిన సీఎం జగన్
1 min readపల్లెవెలుగువెబ్, అమరావతి: అక్టోబర్ 30 బద్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగనున్ననేపథ్యంలో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సుధాను సీఎం జగన్ గురువార ప్రకటించారు. ఈమేరకు ఆయన క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రులు, కడప జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బద్వేల్ అభ్యర్థిగా డాక్టర్ సుధను ప్రకటిస్తూ ఉప ఎన్నికల్లో గతంలో కంటే అధ్యతిక మెజారీతో గెలుపొందేలా అందరూ సమష్ఠిగా కృషి చేయాలని ఆదేశించారు. ఉప ఎన్నికలలో వ్యవహరించాల్సిన వ్యూహంపై సీఎం జగన్ నిశానిర్ధేశం చేశారు. శుక్రవారం నుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాలని సూచించారు. ఈమేరకు మంత్రులు, ఎమ్మెల్యేలకు పలు బాధ్యతలు అప్పగించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం అంజాద్బాష, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, కడప జిల్లా ఇన్‌ఛార్జి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డి(కడప), ఎంపీ మిథున్‌రెడ్డి(రాజంపేట), కడపమేయర్ సురేష్‌బాబు, ఛీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి, విప్ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి(మైదుకూరు), సుధీర్‌రెడ్డి(జమ్మలమడుగు), ప్రసాద్‌రెడ్డి(పొద్దుటూరు), మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రయ్య, ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.