హనుమ కుమారికి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు
1 min readపల్లెవెలుగు వెబ్, ఏలూరు : ఏలూరు ప్రాంతంలోని పెదవేగి మండలానికి చెందిన ఆలపాటి హనుమ కుమారి పుట్టుకతోనే అనారోగ్యంతో బాధపడుతోంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వారియర్స్ హనుమ కుమారి ఆక్సిజన్ తోడుతో నిత్యం పోరాడుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న దెందూలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరి.. వెంటనే సీఎం దృష్టికి తీసుకెళ్లారు. హనుమ చౌదరి వైద్యఖర్చుల నిమిత్తం రూ. 5 లక్షలు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరు చేయించారు.