రేపు.. కర్నూలు జిల్లాలో..1.5 లక్షల మందికి వ్యాక్సినేషన్
1 min read– సచివాలయాలు, పీహెచ్సీ సబ్ సెంటర్లలో నిర్వహణ..
– కలెక్టర్ పి. కోటేశ్వరరావు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కోవిడ్ ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ ఒకటే మార్గమన్నారు కర్నూలు జిల్లా కలెక్టరు పి. కోటేశ్వరరావు. గురువారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ పై ఆర్ డి ఓలు, మున్సిపల్ కమిషనర్ లు, తహసీల్దార్ లు, ఎంపిడిఓలు, మెడికల్ ఆఫీసర్ లతో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు టెలీ కాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు. టీసీలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపు రెడ్డి మౌర్య డిఎమ్ హెచ్ ఓ డాక్టర్ రామగిడ్డయ్య, డిఐఓ డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ పి.కోటేశ్వర రావు మాట్లాడుతూ….జిల్లాకు 1.30 లక్షల వ్యాక్సిన్ వచ్చిందని, ఇప్పటికే నిల్వ ఉన్న 20 వేల డోసులతో కలిపి మొత్తం 1.5 లక్షల వ్యాక్సిన్ ను శుక్రవారం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ సందర్భంగా వేయనున్నామన్నారు. శుక్రవారం సాయంత్రంలోపు వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 18 ఏళ్లు నిండి వ్యాక్సిన్ వేయించుకోని వారు, రెండవ డోసు వేయించుకోని వారు దగ్గరలో ఉన్న సచివాలయం లేదా ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.