క్రైస్తవులకు చట్టసభలలో స్థానం కల్పించాలి
1 min readపల్లెవెలుగువెబ్, గడివేముల: గడివేముల లోని మండల పరిషత్ కార్యాలయంలో వార్డు మెంబర్లు, ఉప సర్పంచులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈవోఆర్డీ అబ్దుల్ ఖాలిక్ ఆధ్వర్యంలో గురువారం నాడు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఈవోఆర్డి మాట్లాడుతూ గ్రామ సమస్యలపై వార్డు మెంబర్లు ఉప సర్పంచులు అవగాహన కలిగి ఉండి సర్పంచుల సమన్వయంతోగ్రామాల అభివృద్ధికి కలిసి పని చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వార్డు మెంబర్లు ఉప సర్పంచులు గ్రామ అభివృద్ధికి తోడ్పడి గ్రామంలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురా వాలని సూచించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలన్నారు. అనంతరం ట్రైనర్లు వార్డుమెంబర్లకు ఉప సర్పంచులకు వారి హక్కులు, విధులు, జాబ్ చార్ట్ గురించి వివరించారు. శిక్షణ ముగించుకున్న సభ్యులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని పంచాయతీ కార్యదర్శులు, గ్రామాల వార్డు సభ్యులు గడిగరేవుల ఉపసర్పంచ్ గోదా ప్రసాద్ పాల్గొన్నారు.