నాగలమడక _పేరూరు పాదయాత్ర
1 min read
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న ప్రజలు
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి నీరా‘జనం’
– రెండో రోజూ అదే జోరు.. హుషారు
– కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ హాజరు
పల్లెవెలుగు,కళ్యాణదుర్గం;
ఎన్నో ఏళ్ల కల సాకారం చేస్తూ.. పేరూరు డ్యాంకు నీళ్లు తెప్పించిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి నాగలమడక నుంచి పేరూరు వరకు చేపట్టిన పాదయాత్రకు రెండోరోజు భారీ స్పందన వచ్చింది. అశేష జనవాహిని మధ్య శుక్రవారం ఉదయం ఎంసీ పల్లి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. కొండాపురం, మక్కినవారపల్లి మీదుగా సాయంత్రం 4 గంటల సమయానికి పేరూరుకు చేరుతుంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తల నడుమ ప్రకాశ్‌రెడ్డి పాదయాత్ర మరో చరిత్రకు నాంది పలుకుతూ కొనసాగుతోంది.