జీవన ఎరువులను వినియోగించండి .. భూసారాన్ని పరిరక్షించండి
1 min read వ్యవసాయ శాఖ ఏడి రాజశేఖర్
పల్లెవెలుగు వెబ్, మహానంది: జీవన ఎరువులు వినియోగించండి …భూసారాన్ని పరిరక్షించండి అని వ్యవసాయ శాఖ ఏడి రాజశేఖర్ పిలుపునిచ్చారు .మండలంలోని నందిపల్లి గ్రామంలో వరి పొలాలను శాస్త్రవేత్తల బృందం తో పరిశీలించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను వినియోగించి అధిక దిగుబడులు పొందాలని సూచించారు.
ప్రస్తుతం వరి పైరు లో తెగుళ్ల తోపాటు సల్ఫర్ ప్రభావంతో పైరులో లో అనేక మార్పులు సంభవించి నష్టపరిచే అవకాశం ఉందన్నారు. భాస్వరం వాడకం తగ్గించి.. పోటాస్ను ఉపయోగించాలని, వరి పైరు ను నీరు లేకుండా ఆరబెట్టాలని రైతులకు సూచించారు. రసాయనిక క్రిమి సంహారక ఎరువుల వినియోగం తగ్గించాలని జీవన ఎరువులు వైపు మొగ్గు చూపాలి అని కోరారు. వ్యవసాయ శాఖ రైతులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది అని ఏ సమస్య తలెత్తినా పరిష్కరించడానికి నిరంతరం అందుబాటులో ఉంటామని శాస్త్రవేత్తలు కూడా మనకు అందుబాటులో ఉన్నారని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏవో సుబ్బారెడ్డి శాస్త్రవేత్తలు శివరామయ్య శ్రీమతి చైతన్య మహేశ్వరి వివో ఎమ్ లక్ష్మీకాంత్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు