పారా మెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: 19 సంవత్సరాల నుండి రెగ్యులర్ పోస్టులలో రూల్ అఫ్ రిజర్వేషన్స్ dsc ద్వారా నియమించబడిన పారామెడికల్ ఉద్యోగుల సర్వీస్ రెగ్యులర్ చేయాలని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డా. టి. గీత ప్రసాదిని కోరారు ysr మెడికల్ &హెల్త్ యూనియన్ అధ్యక్షులు కరుణానిధి , ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ చిన్న రాముడు , కర్నూలు జిల్లా గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ dr రఘురామి రెడ్డి . శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆమెను జిల్లా కాంట్రాక్టు పారామెడికల్ ఐక్య వేదిక నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ysr మెడికల్ &హెల్త్ యూనియన్ అధ్యక్షులు కరుణానిధి మాట్లాడుతూ పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, 27 జీఓను సవరించి టైం స్కేల్ ఇవ్వాలని, త్వరలో జరుగబోవు ట్రాన్స్ఫర్ లలో కాంట్రాక్టు ఉద్యోగులకు అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ లు ఫరూక్, లక్సన్న, రంగన్న, మురళీధర్, రామాంజినేయులు పాల్గొన్నారు.