ఎస్బీఐలో మరో నోటిఫికేషన్ విడుదల! 2056ఉద్యోగ అవకాశాలు
1 min readపల్లెవెలుగువెబ్, ఢిల్లీ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో నోటీఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2056ఉద్యోగాల నియామాలకు సంబంధించిన ఖాళీల జాబితాను వెలువరించింది. ఇందులో మొత్తం 2వేల పోస్టులు రెగ్యులర్ కాగా కేవలం 56పోస్టులు మాత్రం బ్యాక్లాగ్ పరిధిలోనివి. సదరు ఉద్యోగ నియామకాలకు ఈనెల 25తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియ ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూల ద్వారా జరుగనుంది. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ నవంబర్‌లో, ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ డిసెంబర్లో ఉంటుంది. మరిన్ని వివరాలను https://bank.sbi/web/careers or https://www.sbi.co.in/careers నెట్లో పొందవచ్చు. దరఖాస్తు ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్. ఓబీసీ అభ్యర్థులకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు.
కేటగిరి వారీగా పోస్టుల వివరాలు…
రెగ్యులర్ పోస్టుల్లో ఎస్సీ – 300, ఎస్టీ – 150, ఓబీసీ– 540, ఈడబ్ల్యూఎస్ – 200, జనరల్ – 810చొప్పున ఉన్నాయి.
బ్యాక్లాగ్ పోస్టుల్లో ఎస్సీ – 24, ఎస్టీ – 12, ఓబీసీ – 20చొప్పున ఉన్నాయి.
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.
Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.sbi.co.in/careers లేదా https://bank.sbi/web/careers లను సందర్శించాలి.
Step 3 : అనంతరం Latest Announcements ఆప్షన్‌లో నోటిఫికేషన్ చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4 : నోటిఫికేష్‌లో ఇచ్చిన అప్లె లింక్‌పై క్లిక్ చేయండి.
Step 5 : దరఖాస్తు కోసం https://ibpsonline.ibps.in/sbiposasep21/ లింక్ తెరుచుకొంటుంది.
Step 6 : న్యూ రిజిస్టర్ అని ఆప్షన్ ఎంచుకొని పేరు, మొబైలన్ నంబర్, ఈ మెయిల్‌తో రిజిస్టర్ చేసుకోవాలి.
Step 7 : దరఖాస్తు పూర్తయిన తరువాత ఫీజు చెల్లించి అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి.