యాప్‌ల భారం తగ్గించాలి : యూటీఎఫ్
1 min readపల్లెవెలుగు, చాగలమర్రి: బోధన సమయాన్ని హరించి వేస్తున్న యాప్ ల భారాన్ని తగ్గించాలని కోరుతూ యూటీఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు డెన్ని జాన్సన్ ఆధ్వర్యంలో మండలంలోని కొత్తపల్లె,గొడెగనూర్ పాఠశాలలో నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డెన్ని మాట్లాడుతూ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే యాప్ ల భారం తగ్గిస్తానని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక యాప్ ల సంఖ్య పెరిగి ఉపాధ్యాయుల విలువైన బోధన సమయం తగ్గిందని వాపోయారు. కరోనాతో విద్యకు దూరమైన పిల్లలు ఇప్పుడిప్పుడే పాఠశాలలకు వస్తున్నారని , వారికి బోధించే సమయం లేకుండా మధ్యాహ్నం వరకు యాప్ లతో కుస్తీ పట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 4 , 5 , 6 తేదీలలో మొదటి దశ పోరాటంలో భాగంగా నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తూ నిరసన తెలుపుతున్నట్లు తెలిపారు. చైల్డ్ ఇన్ఫో లో సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు విజయ, లలితమ్మ, మదన్‌గోపాల్, రమేష్‌బాబు, మహేంద్ర, ఓబులపతి తదితరులు పాల్గొన్నారు.