PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మెరుగైన వైద్య చికిత్సకు.. ఆర్థిక సహాయం : ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్​

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: వివిధ అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడం ప్రశంసనీయమన్నారు కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​. మంగళవారం కర్నూలు నియోజకవర్గ పరిధిలోని 12 మందికి సీఎంఆర్​ఎఫ్​ కింద మంజూరైన (8లక్షల 4,500రూపాయలు) చెక్కులను రాయల్​ఫంక్షన్​ హాల్​లో ఎమ్మెల్యే అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి బాటలో నడుస్తున్న సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి … ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రత్యేక దృష్టిసారించారు. అనారోగ్యానికి గురైన పేదలకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకే సీఎంఆర్​ఎఫ్​ పథకం అమలు చేస్తున్నారని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

About Author