PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆలయ అర్చకుల సమస్యలు పరిష్కరించాలి

1 min read

– వీహెచ్​పీ రాష్ట్ర కార్యాధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: లోకాఃసమస్తా సుఖినోభవంతూ…అని మనసారా దీవించే ఆలయాల అర్చకుల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు విశ్వహిందూపరిషత్ రాష్ట్ర కార్యాధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి. ధూపదీప నైవేద్యం స్కీం కింద అర్చకులకు ఇచ్చే ధనం వెంటనే ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ మంగళవారం వీహెచ్​పీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఎండోమెంట్​ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వహిందూపరిషత్ రాష్ట్ర కార్యాధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ గతంలో ఆదాయం లేని ఆలయాలలో నిత్యం జరిగే కైంకర్యాలకు ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో దూప దీప నైవేద్యం స్కీమును ప్రభుత్వం ప్రారంభించి సుమారు 2500 రూపాయలు ఈ స్కీమ్ కింద 6 సీ. ఆలయాలకు ఇచ్చేది. కానీ గత కొన్ని నెలలుగా ఆ ధనం ఇవ్వకపోవడం… కరోన కారణంగా భక్తులు ఆలయాలకు రాకపోవడంతో అర్చకులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అర్చకుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎండోమెంట్​ అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ధర్మప్రసార్ కన్వీనర్ ఏ.వీ.ప్రసాద్,అర్చక పురోహిత జిల్లా కన్వీనర్ సాయినాథశర్మ, కర్నూలు నగర కార్యాధ్యక్షులు గోరంట్ల రమణ, జిల్లా కార్యదర్శి విజయుడు,చాలా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

About Author