NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టాలీవుడ్ లో డ్రగ్స్

1 min read

టాలీవుడ్ లో మ‌రోసారి డ్రగ్స్ క‌ల‌క‌లం మొద‌లైంది. టాలీవుడ్ హీరో త‌నీష్ కు డ్రగ్స్ కేసులో క‌ర్ణాట‌క పోలీసులు నోటీసులు జారీ చేశారు. క‌ర్ణాట‌క‌లో సంచ‌ల‌న సృష్టించిన డ్రగ్స్ కేసులో హీరో త‌నీష్ ను విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ క‌ర్ణాట‌క పోలీసులు కోరారు. త‌నీష్ తో పాటు మ‌రో ఐదుగురికి కూడ నోటీసులు జారీ చేసిన‌ట్టు తెలుస్తోంది. వీరిలో నిర్మాత శంక‌ర్ గౌడ‌తో పాటు ఓ ప్రముఖ వ్యాపార వేత్త ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇది టాలీవుడ్ లోని ప్రముఖుల మెడ‌కు చుట్టుకునే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు భావిస్తున్నారు. నిర్మాత శంక‌ర్ గౌడ ఏర్పాటు చేసిన రేవ్ పార్టీకి వెళ్లిన ప్రముఖులంద‌రికి పోలీసులు నోటీసులు జారీ చేసిన‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో హీరో త‌నీష్ డ్రగ్స్ కేసులో విచార‌ణ ఎదుర్కొన్నారు.

About Author