నర్సాపురం ఎంపీ రఘురామకు తెలంగాణ హైకోర్టు షాక్!
1 min readపల్లెవెలుగువెబ్, హైదరాబాద్: ఏపీ నర్సాపురం వైసీపీ పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజుకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. తాజాగా ఆక్రమ ఆస్తుల కేసుల విషయంలో ఏపీ సీఎం జగన్, వైసీపీ రాజ్యసభ్యుడు విజయసాయిరెడ్డిల బెయిల్‌ను రద్దు చేయాలన్న షిటీషన్ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. పలు సాంకేతిక కారణాల వల్ల హైకోర్టు రిజిస్ట్రీ రఘురామ పిటీషన్‌ను వెనక్కి పంపారు. అక్రమ ఆస్తుల కేసు వ్యవహారంపై ఎంపీ రఘురామ గతంలోనూ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత పిటిషన్‌ను సైతం తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో న్యాయం కోసం చివరివరకు పోరాడుతానని ఏంపీ రఘురామరాజు పేర్కొనడం గమనార్హం.