ప్రశాంతంగా ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ
1 min readగ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభయ్యాయి. కర్నూలు జిల్లాలో తొలిదశగా 12 మండలాలు, 142 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా 1515 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అథారిటీ, కలెక్టర్ జి. వీరపాండియన్ తెలిపారు. మంగళవారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన పోలింగ్ నిర్వహణకు… తెల్లవారు జామున 5.30 గంటల నుంచి వెబ్ కాస్టింగ్ , పోలీసత్ వైర్ లెస్ సెట్ ద్వారా , టీవీ ఛానల్స ద్వారా మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జేసీలు రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా మోహిద్దీన్, డి.ఆర్.ఓ పుల్లయ్య, డిపిఓ ప్రభాకర్ రావ్ ప్రత్యక్ష పర్యవేక్షణ నిర్వహించారు. అనంతరం ఏమైనా సమస్య ఉంటే యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడానికి 19 నోడల్ కమిటీల జిల్లా అధికారులను నియమించినట్లు కలెక్టర్ వెల్లడించారు.