ఏపీ మంత్రి సురేష్‌కు సుప్రీంకోర్టు ఝలక్! పాతకేసు పునర్విచారణకు ఆదేశం
1 min readపల్లెవెలుగువెబ్, ఢిల్లీ: ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు సుప్రీంకోర్టు ఝలకిచ్చింది. అక్రమ ఆస్తులపై ఉన్న పాత కేసును సుప్రీంకోర్టు పునర్విచారణకు శుక్రవారం ఆదేశించింది. సురేష్ రాజకీయాల్లోకి రాకముందు ఆయన సతీమణి విజయలక్ష్మీ ఐఆర్ఎస్ అధికారిగా పనిచేశారు. ఈ క్రమంలో ఆక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న కోణంలో 2016లో సురేష్ ఇంటిపై సీబీఐ సోదాలు నిర్వహించింది. సీబీఐ విచారణ నేపథ్యంలో 2017లో 22శాతం ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న అంశంపై కేసు నమోదు చేశారు. దీంతో సురేష్ దంపతులు సైతం అప్పట్లో సీబీఐ విచారణను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆశ్రయించారు. ఈ క్రమంలో సురేష్ దంపతులపై ఉన్న సీబీఐ కేసు టీఎస్ హైకోర్టు కొట్టసింది. అయితే సీబీఐ సదరు కేసువిషయమై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఈ ఏడాది సెప్టెంబర్ 22న తీర్పును రిజర్వు చేసింది. తిరిగి పరిశీలన జరిపిన సుప్రీంకోర్టు తాజాగా శుక్రవారం సురేష్ ఆక్రమ ఆస్తులపై పునర్విచారణకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆస్తులపై సీబీఐ విచారణ కొనసాగించనున్నట్లు తెలుస్తాంది.