ఈ స్మార్ట్ ఫోన్ కొంటే.. 6 వేలు క్యాష్ బ్యాక్ !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఎయిర్ టెల్ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ కొనుగోలు పై 6వేలు క్యాష్ బ్యాక్ ప్రకటించింది. రెండు విడతల్లో ఈ మొత్తాన్ని వినియోగదారుడికి జమ చేయనుంది. 2జీ కస్టమర్లను 4జీలోకి ఆకర్షించడంలో భాగంగా మేరా పహ్లా స్మార్ట్ ఫోన్
కింద ఈ ఆఫర్ ప్రకటించింది. 12 వేలలోపు ధర ఉన్న వివిధ బ్రాండ్లకు చెందిన 150 స్మార్ట్ ఫోన్ మోడళ్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. క్యాష్ బ్యాక్ కోసం కస్టమర్ ప్రతి నెల 249 రూపాయలు, ఆ పై మొత్తంతో క్రమం తప్పకుండా 36 నెలల పాటు రీచార్జీ చేయాలి. అప్పుడు తొలి 18 నెలల తర్వాత 2 వేలు.. 36 నెలల తర్వాత మిగిలిన 4 వేలు క్యాష్ బ్యాక్ కింద ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ లో జమచేస్తారు. ఏడాది పాటు ఉచితంగా స్క్రీన్ రీప్లేస్మెంట్ సర్వీస్ కూడ అందిస్తారు.