మసీదులో సందేశం ఇచ్చాక… ప్రభుత్వ ఖాజీ మృతి
1 min readపల్లెవెలుగు వెబ్, గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఖాజీ సయ్యద్ షా ఖా బాషా ఖాద్రి (65) శుక్రవారం మృతి చెందారు. గుంతకల్లు మసీదులలో సందేశం ఇచ్చిన తరువాత.. మెట్లు దిగేటప్పుడు కిందకు పడిపోవడంతో అక్కడికక్కడే ఊపిరివదిలారు. కి శే సయ్యద్ షా లతీఫ్ బాషా ఖాద్రి లోబాలి కుమారుడైన సయ్యద్ షా ఖా బాషా ఖాద్రి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయలుగా రిటైర్డు అయ్యారు.
ఆ తరువాత చిప్పగిరి దర్గాకు పీఠాధిపతిగా ఉన్నారు. గుంతకల్లు ప్రభుత్వ ఖాజీగా ముస్లిం సోదరులకు మసీదులో ప్రార్థన చేయించిన తరువాత మెట్లు దిగుతుండగా కింద పడిపోయాడు. ప్రభుత్వ ఖాజీ సయ్యద్ షా ఖా బాషా ఖాద్రి మృతి చెందడంతో గుంతకల్లు ముస్లిం సోదరులలో విషాదం నెలకొంది. ఆయన అంత్యక్రియలు శనివారం చిప్పగిరిలో చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.