హై అలర్ట్ .. రాజధానికి ఉగ్రముప్పు !
1 min read
The India Gate war memorial in New Delhi, India
పల్లెవెలుగు వెబ్ : దేశ రాజధాని ఢిల్లీకి ఉగ్రముప్పు ఉన్న నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం. పండుగ సీజన్ నేపథ్యంలో ఉగ్రవాదులు భారీ దాడులకు పాల్పడే అవకాశం ఉందని సమాచారం అందింది. దీన్ని అరికట్టేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఢిల్లీ నగర పోలీస్ కమీషనర్ రాకేష్ ఆస్థానా ఆదేశించారు. స్థానికుల సహాకారం లేకుండా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడే అవకాశం లేదని రాకేష్ ఆస్థానా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు స్థానికుల నుంచి సహాయం అందకుండా చూసుకోవాలని పోలీసులకు సూచించారు. పెట్రోల్ పంపులు, ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. స్థానికులకు అవసరమైన సూచనలు చేయాలని, కొత్తగా వచ్చిన వారిని తనిఖీలు చేయాలని రాకేష్ ఆస్థానా పోలీసులను ఆదేశించారు.