NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘లఖింపూర్​’ అమరవీరులకు ఘననివాళి

1 min read

పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: వ్యవసాయ సాగు నూతన చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్త ఆందోళనలో భాగంగా లఖింపూర్​ రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే.. జీర్ణించుకోలేని కేంద్ర సహాయ మంత్రి అజయ్​మిశ్రా కొడుకు అమిత్​ మిశ్రా రైతులపై కారును దుర్మార్గంగా ఎక్కించాని, దీంతో నలుగురు రైతులు అక్కడికక్కడే మృతి చెందారని, మరెందరో గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ అనుబంధ సంఘం, అఖిల భారత కిసాన్ మహాసభ, ఏఐసిసిటియు అఖిల భారత ప్రగతి శీల మహిళా సంఘం, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అనుబంధ సంఘాలు, ఐ ఎఫ్ టి యు బి ఓ సి సంఘాల నాయకులు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుమేరకు దేశవ్యాప్తంగా లఖింపూర్ ఉద్యమంలో మరణించిన అమరవీరులకు నివాళులు అర్పించాలని పిలుపునివ్వడంతో ఆదివారం కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణం వాల్మీకి నగర్ వడ్డెపేటలో ఆయా సంఘాల ఆధ్వర్యంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. రమేష్​ అధ్యక్షత వహించిన సభలో అఖిల భారత కిసాన్ మహాసభ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఐఎఫ్ టి యు జిల్లా నాయకులు మజీద్ మియా మాట్లాడుతూ మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని 11 నెలలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నార న్నారు. కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తోందన్నారు. రైతుల మృతికి కారణమైన ఆశిశ్​ మిశ్రాను కఠినంగా శిక్షించి… అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించలని డిమాండ్​ చేశారు. నల్లచట్టాలపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే 18వ తేదీ దేశవ్యాప్తంగా రైలు రోకో, రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి ఓ సి నాయకులు మౌలాలి, రఫీ, చాంద్ భాషా, పి ఓ డబ్ల్యు నాయకురాలు సూరి బి, అఖిల భారత కిసాన్ మహాసభ నాయకులు కృష్ణయ్య, అంకన్న. అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం డివిజన్ నాయకులు ఎస్ బి బి, లక్ష్మీదేవి, గీతాంజలి, జయమ్మ, ఈశ్వరమ్మ, ఏ ఏ ఐ సి సి టి యు నాయకులు ఈ భాస్కర్ గౌడ్ ,వడ్డే రాజు, మధు, తదితరులు పాల్గొన్నారు.

About Author