ఎట్టకేలకు ముగిసిన ‘మా’ ఎన్నికల పోలింగ్ – 83శాతం నమోదు
1 min readపల్లెవెలుగువెబ్, హైదరాబాద్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎట్టకేలకు ఉత్కంఠత వాతావరణం నడుమ ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల పోలింగ్ ముగిసింది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహీల్స్ పబ్లీక్స్కూల్లో ఆదివారం ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3.30గంటలకు ముగిసింది. ముందస్తు నిర్ణయం ప్రకారం 2గంటలకు వరకే కొనసాగాల్సిన పోలింగ్ ఇరు ప్యానళ్ల అభ్యర్థన మేరకు పోలింగ్ సమయానికి మరో గంటన్నరపాటు పొడగించారు. దీంతో రికార్డుస్థాయిలో పోలింగ్ 82శాతం నమోదయింది. మొత్ం 883మంది మా అసోసియేషన్ సభ్యులు ఉండగా అందులో 665మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిత్రపరిశ్రమ అథిరథ నటీనటులు మెగాస్టార్ చిరంజీవి, పవన్‌కళ్యాణ్, నాగార్జున, బాలకృష్ణలతోపాటు గిరిబాబు, కోటశ్రీనివాసరావు, చలపతిరావు, బ్రహ్మానందం వంటి సీనియర్ నటులు ఓట్లు వేశారు. అయితే విక్లరీ వెంకటేష్, మహేష్‌బాబు, జూ.ఎన్టీఆర్, ప్రభాస్, రానా, నితిన్, నాగచైతన్య, అల్లుఅర్జున్, సునీల్, సుమంత్, సుశాంత్, వరుణ్‌తేజ్, విజయ్ దోవరకొండ, శర్వానంద్, రవితేజ, అనుష్క, రకుల్, త్రిష, ఇలియానా వంటి నటీనటులు మా పోలింగ్‌కు దూరంగా ఉండడం గమనార్హం. ఎన్నికల కౌంటింగ్ సాయంత్రం 5గంటల నుంచి ప్రారంభమవుతుంది.