PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీవారిసేవలో సీనీ హీరో విజయ్​ దేవరకొండ!

1 min read

పల్లెవెలుగువెబ్​, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతోన్న నేపథ్యంలో టాలివుడ్ హీరో విజయ్​ దేవరకొండ ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. సోదరుడు ఆనంద్​ దేవరకొండతోపాటు కుటుంబ సభ్యలతో కలిసి తిరుమల కొండకు వచ్చిన విజయ్​ దేవరకొండకు టీటీడీ అధికారులు శ్రీవారి దర్శనంలో వెసలుబాటు కల్పించారు. విజయ్​ దేవరకొండ తెలుగు చిత్ర పరిశ్రమలో అనతికాలంలో స్టార్​ హీరోగా ఎదిగారు. అర్జున్​రెడ్డి చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకులకు మరింత దగ్గరై భారీ ఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు. విజయ్​ దేవరకొండ లేటెస్ట్​ మూవీ ‘లైగర్​’ చిత్రీకరణ దశలో ఉంది.

About Author