మంత్రాలయ రాఘవేంద్రడి సేవలో ఏపీ మంత్రి శంకర్‌నారాయణ
1 min readపల్లెవెలుగువెబ్, కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో ఏపీ రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్‌నారాయణ ఆదివారం రాఘవేంద్రస్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి సేవార్థం వచ్చిన మంత్రి శంకర్‌నారాయణకు మంఠాధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. రాఘవేంద్రుడి సన్నిధిలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. పూజా కార్యక్రమాలు ముగిశాక మఠాధిపతి మంత్రిని శేషవస్త్రాలు, ప్రసాదాలతో సత్కరించారు. అనంతరం మంత్రి ఆదోనిలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ను కలిశారు. ఈ మేరకు రాష్ట్రంలో నెలకొన్న పలు రాజకీయ సమీకరణాలు, త్వరలో జరగబోవు కేబినేట్ విస్తరణ వంటి అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశంలో హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాదవ్, తదితరులు ఉన్నారు.