నాగబాబు సంచలన నిర్ణయం !
1 min readపల్లెవెలుగు వెబ్: మెగా బ్రదర్ నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న ‘మా’ లో కొనసాగడం నాకు ఇష్టం లేక, `‘మా’ అసోసియేషన్ లోని ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు నాగబాబు ప్రకటించారు. 48 గంటల్లో ‘మా’ కార్యాలయానికి తన రాజీనామా లేఖ పంపిస్తానని నాగబాబు ట్వీట్ చేశారు. మొదట్నుంచీ నాగబాబు ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు మద్దతు తెలుపుతూ వచ్చారు. మంచు విష్ణు .. ప్రకాశ్ రాజ్ పై గెలుపొందడంతో నాగబాబు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.