ఆల్ టైం హైని తాకిన సూచీలు.. మార్కెట్లో బుల్ పరుగులు !
1 min readపల్లెవెలుగు వెబ్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు జీవిత కాల గరిష్ఠాన్ని తాకాయి. ఉదయం ఫ్లాట్ గా ట్రేడింగ్ మొదలై.. అనంతరం పుంజుకుని లాభాల్లో కొనసాగింది. నిఫ్టీ 50 ఇండెక్స్ తొలిసారి 18000 మార్కును దాటింది. అంతర్జాతీయ పరిణామాలతో పాటు దేశీయంగా రిలయన్స్, టాటా మోటార్స్ కంపెనీలు ఆల్ టైం హైని చేరడంతో మార్కెట్లో బుల్ రన్ కొనసాగింది. సెన్సెక్స్ 72 పాయింట్ల లాభంతో 60,135 వద్ద, నిప్టీ 50 పాయింట్ల లాభంతో 17946 వద్ద, బ్యాంక్ నిఫ్టీ 518 పాయింట్ల లాభంతో 38293 వద్ద ట్రేడింగ్ ముగించింది. ప్రధానంగా ఆటో, పవర్ స్టాక్స్ మార్కెట్ ను ఇవాళ లీడ్ చేశాయి.