NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నోబెల్ బ‌హుమ‌తి వీరికే .. !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : నోబెల్ బ‌హుమ‌తి ఈ ఏడాది ముగ్గురిని వ‌రించింది. అమెరికాకు చెందిన ఆర్థిక వేత్తలు డేవిడ్ కార్డ్, జాషువా. డి. ఆంగ్రిస్ట్, గైడో డ‌బ్ల్యూ. ఇంబెన్స్ ల‌కు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అందిస్తున్నట్టు రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ ప్రక‌టించింది. ఇందులో స‌గం పుర‌స్కారాన్ని డేవిడ్ కార్డ్ కు , మిగిలిన స‌గాన్ని జాషువా, గైడో పంచుకోనున్నారు. కార్మిక ఆర్థిక అంశాల‌కు సంబంధించి ప‌రిశోధ‌నాత్మక స‌హ‌కారం అందించినందుకు గాను డేవిడ్ కార్డ్ కు నోబెల్ అందిస్తున్నట్టు అకాడ‌మీ తెలిపింది. ఇక ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన విశ్లేష‌ణాత్మకమైన ప‌రిశోధ‌న‌ల‌పై స‌హ‌కారం అందించినందుకు జాషువా, గైడోల‌కు కూడ ఈ పుర‌స్కారం ఇస్తున్నట్టు అకాడ‌మీ ప్రక‌టించింది.

About Author