ఆదోనిలో..ఫ్యాన్
1 min readపల్లెవెలుగు, ఆదోని
మున్సిపల్ ఎన్నికలో ఫ్యాన్ గాలి రాష్ట్ర వ్యాప్తంగా వీస్తోంది. జిల్లాలో కర్నూలు కార్పొరేషన్‌తోపాటు ఏడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ కలిపి మొత్తం 302 వార్డులు ఉన్నాయి. అందులో 77 ఏకగ్రీవం కాగా..225 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించిన జిల్లా యంత్రాంగం… మధ్యాహ్నం 1 గంటలలోపు అన్ని మున్సిపాలటీల ఎన్నికల ఫలితాల లెక్కింపును పూర్తి చేశారు. కర్నూలు, ఆదోని, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, నంద్యాల, గూడురు నగర పంచాయతీలో వైసీపీ జెండా ఎగరేసింది.
ఫ్యాన్ హవా..
ఆదోని మున్సిపల్ పరిధిలో మొత్తం 42 వార్డులు ఉండగా అందులో 9 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 33 వార్డులకు ఎన్నికలు జరగగా.. 31 వైసీపీ విజయఢంకా మోగించగా… ఒకటి రెబల్, ఒకటి మాత్రమే టీడీపీ సొంతం చేసుకుంది.
విజయోత్సవ సంబరాలు
ఆదోనిలో 40 వార్డులు వైసీపీ విజయకేతనం ఎగర వేయగా.. మరొకటి రెబల్ అభ్యర్థి విజయం సాధించారు. ఆదోని మున్సిపాలిటీపై వైసీపీ జెండా ఎగరనుండటంతో.. వైసీపీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి.
25వ వార్డు కౌన్సిలర్ సిద్ధ కృష్ణవేణికి స్వీట్ తినిపిస్తున్న భర్త మల్లికార్జున