రాష్ట్రానికి విద్యుత్సంక్షోభం.. కరెంట్ కోతలు తప్పవ్! సజ్జల
1 min readపల్లెవెలుగువెబ్, అమరావతి: రాష్ట్రానికి విద్యుత్ సంక్షోభం ముప్పు పొంచి ఉందని, మున్ముందు విద్యుత్ కోతలు మరింత అనివార్యమయ్యే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. విద్యుత్ సంక్షోభ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ప్రజలు విద్యుత్ వాడకం తగ్గించాలని కోరారు. విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండే సమయాల్లో సాయంత్రం 6నుంచి రాత్రి 10గంటల దాకా ఏ/సీల వాడకాన్ని నియంత్రించాలని కోరారు. ప్రస్తుత కాలంలో విద్యుత్ వాడకాన్ని గణనీయంగా తగ్గిస్తే వేసవిలో ఆదా విద్యుత్‌ను వినియోగించుకునే సౌలభ్యం కలుగుతుందన్నారు. లేనిపక్షంలో పరిస్థితులు అదుతప్పే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. యూనిట్ ధర రూ.20నుంచి రూ.25కు పెరిగే అవకాశం సైతం లేపపోలేదని, కోవిడ్ సమయంలో ఆక్సీజన్ కొరతను ఎలా ఎదుర్కొన్నామో… మున్ముందు విద్యుత్ కొరత సైతం అదే తరహాలో ఉండొచ్చని హెచ్చరించారు. రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ 20శాతం పెరిగిందని, కోవిడ్‌కు ముందు అక్టోబర్‌లో రోజుకు 160ఎం.యూ మేర డిమాండ్ ఉంటే… అది ప్రస్తుతం 190ఎం.యూ.కు పెరిగిందన్నారు. దేశంలో బొగ్గు కొరత కారణంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదకత శాతం తగ్గిందన్నారు. ఈ క్రమంలోనే సీఎం. జగన్ ఇటీవలే ప్రధాని మోడీకి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు.