75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి : జగన్
1 min readపల్లెవెలుగు వెబ్ : అమ్మఒడి పథకాన్ని విద్యార్థుల హాజరుతో అనుసంధించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. విద్యార్థుల హాజరు శాతం 75 శాతంగా గతంలో నిర్ణయించామని, ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ నిబంధన అమలు చేయాలని చెప్పారు. అమ్మ ఒడి, విద్యాకానుక, విద్యార్థుల హాజరు, కరోన లాంటి అంశాల మీద అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. 2024 నాటికి విద్యార్థులు సీబీఎస్సీ పరీక్షలు రాసేవిధంగా ముందుకు సాగాలన్నారు. ఎయిడెడ్ స్కూళ్లను విలీనం చేయమని బలవంతం చేయట్లేదన్న విషయాన్ని చెప్పాలని కోరారు. స్కూళ్ల అప్పగింత అనేది స్వచ్చందమనే విషయాన్ని ప్రజలకు చెప్పాలని సూచించారు.