సేవకు.. గుర్తింపు..
1 min read– ఆరోగ్య, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలకు ప్రశంస పత్రాలు
పల్లెవెలుగు వెబ్, చాగలమర్రి: అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ మండలములో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పని చేస్తున్న ఆశ, ఆరోగ్య, అంగన్వాడీ కార్యకర్తలకు ప్రశంసాపత్రాలు అందజేసి.. ఘనంగా సన్మానించారు. సోమవారం నంద్యాల ఎస్పీవై రెడ్డి కళాక్షేత్రంలో సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారుల సేవకు గుర్తింపునిస్తూ ప్రశంసాపత్రాలు అందజేశారు. విధి నిర్వహణలో భాగంగా గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం, భేటీ బచావో, బేటి పడావో అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పించి నందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలను అనుసరించి ఆరోగ్య, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలకు ప్రశంసాపత్రాలను అందజేశారు. భవిష్యత్లో మరిన్ని అవార్డులు, ప్రశంసాపత్రాలు పొందాలని ఉన్నతాధికారులు ఆకాంక్షించారు.