కర్నూలు శ్రీలలితాదేవి ఆలయంలో..‘టీటీడీ’ ఆధ్యాత్మిక కార్యక్రమం..
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీలలితాదేవి ఆలయం నందు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను లలితా పీఠం కళావేదిక నందు తెలియపరచారు.
– 13-10-2021 బుధవారం ఉదయం 7-00 గంటలకు దుర్గాష్టమి సందర్భంగా మేడా భవానీ బృందం ఆధ్వర్యంలో శ్రీలలితా సహస్ర నామ స్తోత్రపారాయణం మరియు భజన కార్యక్రమం.
–14-10-2021 గురువారం ఉదయం 7-00 గంటలకు శరన్నవరాత్రి సందర్భంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం, మరియు డాక్టర్ తొగట సురేశ్ బాబుచే నవరాత్రి వైభవం -నవయువతకు సందేశంపై ప్రవచనం.
– 15-10-2021 శుక్రవారం ఉదయం 7-00 గంటలకు విజయదశమి సందర్భంగా విశ్వనాథం మానస బృందంచే సామూహిక లలితా సహస్రనామ స్తోత్ర సహిత కుంకుమార్చన కార్యక్రమం మరియు విద్వాన్ టి.గుర్రప్పగారిచే విజయదశమి విశిష్టతపై ధార్మిక ప్రవచనం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా లలితా పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు గురు మేడ సుబ్రహ్మణ్యం స్వామి మాట్లాడుతూ భక్తులందరికీ అల్పాహార ప్రసాదం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి బైసాని అంజనీ సురేశ్ కుమార్, పూరి చంద్రమోహన్, యం.వైష్ణవి, శ్రీరాఘవేంద్రస్వామి సేవా సత్సంగ్ ప్రముఖ్ రాఘవేంద్ర కుమార్, యం.నాగభూషణం వివిధ ధార్మిక సంస్ధల ప్రతినిధులు పాల్గొన్నారు.