విభిన్న ప్రతిభావంతులకు.. 407 ఉపకరణాలు అందజేత
1 min read– విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ విజయ
పల్లెవెలుగు వెబ్, దేవనకొండ: జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులను ఆదుకోవాలన్న లక్ష్యంతో స్వచ్ఛంద సంస్థల ద్వారా రూ.50లక్షలు విలువ చేసే 407 ఉపకరణాలు పంపిణీ చేశామని తెలిపారు ఆ శాఖ ఏడీ విజయ. కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో సోమవారం పీటీసీ ఫౌండేషన్, పీటీసీ ఇంజనీర్స్ వారి సౌజన్యంతో ఆలీంకో, కాన్పూర్ వారి ఆధ్వర్యంలో వివిధ ఉపకరణాలు అందజేశారు. రూ. 50లక్షలు విలువైన 407 ఉపకరణాలను 244 మందికి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయ మాట్లాడుతూ కలెక్టర్ పి. కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ ( ఆసరా మరియు వెల్ఫేర్) ఎంకేవీ శ్రీనివాసులు ఆదేశానుసారం… పీటీసీ ఫౌంటేషన్ సహకారం… ఆలీంకో, కాన్నూర్ వారి నేతృత్వంలో విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో దేవనకొండ ఎంపీడీఓ ఆదయ్య, ఆలీంకో మేనేజర్ రాజేష్, పీటీసీ ఫౌండేషన్ మేనేజర్ వియష్ శంకర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శాంత, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.