PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రాజెక్టులు, విద్యుత్​కేంద్రాలు అప్పగించండి! ఉభయరాష్ట్రాలకు కేఆర్​ఎంబీ సూచన

1 min read

పల్లెవెలుగువెబ్​, హైదరాబాద్​: ఉభయ తెలుగురాష్ట్రాల్లోని శ్రీశైలం, నాగార్జునసాగర్​ ప్రాజెక్టులు, వాటి పరిధుల్లోని విద్యుత్​కేంద్రాలను తమకు అప్పగించాలని కృష్ణా రివర్​ మెనేజ్​మెంట్​ బోర్డు ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలకు సూచించింది. మంగళవారం హైదరాబాద్​లోని విద్యుత్​ సౌదాలో కేఆర్​ఎంసీ బోర్డు సమావేశం జరిగింది. ఈమేరకు శ్రీశైలం, నాగార్జునసాగర్​ ప్రాజెక్టుల పరిధుల్లోని అన్ని అవుట్​లెట్లను బోర్డు పరిధిలోకి తీసుకోనున్నట్లు కేఆర్ఎంబీ చైర్మన్​ ఎంపీసింగ్​ వెల్లడించారు. ఉభయ తెలుగురాష్ట్రాలు ప్రాజెక్టులు, విద్యుత్​కేంద్రాలు బోర్డులకు అప్పగిస్తే ఈనెల 14నుంచి గెజిట్​ అమలు చేస్తామన్నారు. ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రుత్వశాఖ ప్రాజెక్టులను ఆయా రివర్​ బోర్డుల పరిధుల్లోకి తెచ్చేందుకు గెజిట్​ నోటఫికేషన్​ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉభయ తెలుగురాష్ట్రాల ప్రాజెక్టులు, విద్యుత్​కేంద్రాల అప్పగింతను కోరుతున్నట్లు కేఆర్​ఎంబీ చైర్మన్​ పేర్కొన్నారు. అప్పగింతకు ఏపీ ప్రభుత్వం ముందుకురాగా తెలంగాణ మాత్రం ససేమిరా అంటుండడం గమనార్హం. ఓవైపు ఇప్పటికే తెలంగాణ చేపడుతోన్న కృష్ణా జలాల నీటివినియోగం, విద్యుత్పత్తిని నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం కేఆర్​ఎంబీకి పలుమార్లు లేఖలు రాసిన విషయం తెలిసిందే. అయినా తెలంగాణ ప్రభుత్వ వైఖరిలో మార్పులు రాకపోవడంతో ఏపీ ఫిర్యాదులు సైతం చేసింది.

About Author