డిగ్రీ కళాశాలలో సీట్లు అమ్ముకోవడం అన్యాయం: టీడీపీ
1 min readపల్లెవెలుగు వెబ్, ఆస్పరి: డిగ్రీ కళాశాలలో 30 శాతం సీట్లు అమ్ముకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం అన్యాయమన్నారు తెలుగు యూత్ మండల అధ్యక్షుడు రాఘవేంద్ర యాదవ్,సతీష్ కుమార్ బుధవారం ఆస్పరి టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం వారు మాట్లాడారు. డిగ్రీ కళాశాలల్లో 30% శాతం సీట్లను మేనేజ్మెంట్ కోట కింద అమ్ముకునెందుకు ప్రభుత్వం అనుమతివ్వడం దారుణమన్నారు. ఆ సీట్లను సాధారణ ఫీజు కంటే మూడు రెట్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ సీట్లలో చేరిన వారికి ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలు వర్తించదు. విద్యా దీవెన ఇవ్వలేక సీట్లు అమ్ముకునెందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు వీరేష్, టిఎన్ఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు మారేష్, ఉపేంద్ర యాదవ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.