మీ ఫోన్ లో ఈ యాప్స్ ని డిలీట్ చేయండి !
1 min readపల్లెవెలుగు వెబ్: వైరస్, మాల్ వేర్ లాంటి సమస్యలున్న యాప్స్ ను గూగుల్ తరచూ ప్లేస్టోర్ నుంచి తొలగిస్తుంది. కొద్దిరోజుల క్రితం 150 దాక ఇలాంటి యాప్స్ ను తొలగించింది. ఈ క్రమంలో యూజర్స్ కూడ ఇలాంటి యాప్స్ తొలగించాలని సూచించింది. ఈ యాప్స్ ద్వార సైబర్ నేరగాళ్లు యూజర్స్ డేటా, వారి బ్యాంక్ అకౌంట్ వివరాలు చోరీ చేస్తున్నారని సెక్యూరిటీ సంస్థ కాస్పర స్కై వెల్లడించింది. యూజర్స్ ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసే యాప్స్ పేర్లలో అక్షరదోషాలు ఉంటే వాటికి దూరంగా ఉండటం మంచిదని తెలిపింది.
డిలీట్ చేసిన యాప్స్ ఇవే :
- మ్యాజిక్ ఫోటో ల్యాబ్ – ఫోటో ఎడిటర్
- బ్లెండర్ ఫోటో ఎడిటర్ – ఈజీ ఫోటో బ్యాంక్ గ్రౌండ్ ఎడిటర్
- పిక్స్ ఫోటో మోషన్ ఎడిట్ 2021