మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఇకలేరు! ధృవీకరించిన మావోయిస్టుపార్టీ
1 min readపల్లెవెలుగువెబ్, చత్తీష్‌గడ్: మావోయిస్టు అగ్రనేత ఆర్కే(రామకృష్ణ)మృతిచెందారన్న..విషయాన్ని మావోయిస్టుపార్టీ శుక్రవారం ధృవీకరించింది. చత్తష్గడ్ అడవుల్లోని బస్తర్ గ్రామంలో 14న మావోయిస్టు నేత రామకృష్ణ తీవ్ర అనారోగ్యంతో మరణించినట్లుగా తెలుస్తోంది. ఆర్కే మృతిని మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ ధృవీకరిస్తూ లేఖ విడుదల చేశారు. గతకొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతోన్న ఆర్కే సరైన వైద్యం అందక మృతిచెందినట్లుగా పేర్కొన్నారు. 1958లో గుంటూరు జిల్లా పల్నాడులో జన్మించిన ఆర్కే 25ఏళ్ల వయసులో నక్సల్ ఉద్యమానికి ఆకర్షితుడై 1982లో పీపుల్స్‌వార్ పార్టీలో చేరాడు. నల్లమల అరణ్యంలో నక్సల్ ఉద్యమం విస్తరణక కృషి చేశారు. అప్పట్లో గుంటూరు జిల్లా కార్యదర్శిగా పనిచేసి 1992లో రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా, 2001లో ఏవోబీ కార్యదర్శిగా పనిచేస్తూ కేంద్రకమిటీ స్థాయికి ఎదిగాడు. 2004లో అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం జరిపిన శాంతిచర్చల్లో నక్సల్స్ ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించారు. అయితే చర్చల విఫలంలో తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ క్రమంలో 2018లోకేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరోలో ఆర్కే స్థానం దక్కించుకున్నారు. 40ఏళ్ల ఉద్యమ బాటలో అనేక మార్లు పోలీసు ఎన్కౌంటర్ల నుంచి ఆర్కే తృటిలో తప్పించుకున్నారు. మావోయిస్టు ఉద్యమబాటలో సదీర్ఘంగా పోరాడుతోన్న ఆర్కే అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా 63ఏళ్లకు కిడ్నీసమస్యతో తనువుచాలించడం విషాదకరం.