దేశానికి ఏడు డిఫెన్స్ కంపెనీలు! ప్రారంభించిన ప్రధాని మోడీ
1 min readపల్లెవెలుగువెబ్, ఢిల్లీ: భారతప్రధాని నరేంద్రమోడీ విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశానికి ఏడు రక్షణ(డిఫెన్స్)కంపెనీలను అంకితం చేశారు. దీంతో దేశం ప్రపంచంలోనే బలమైన మిలిటరీ శక్తిగా నిలువనుంది. ఈమేరకు శుక్రవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో కేంద్ర రక్షణ మంతృత్వశాఖ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన మోడీ సదరు డిఫెన్స్ కంపెనీలను వర్చువల్‌గా ప్రారంభించారు. జాతికి అంకతం చేసిన కంపెనీల్లో మునిషన్స్ ఇండియా లిమిటెడ్ (MIL); ఆర్మర్డ్ వెహికిల్స్ నిగమ్ లిమిటెడ్ (AVANI), అడ్వాన్స్‌డ్ వెపన్స్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ (AWE ఇండియా), ట్రూప్ కంఫోర్ట్స్ లిమిటెడ్ (TCL), యంత్ర ఇండియా లిమిటెడ్ (YIL); ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ (IOL) మరియు గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ (GIL) ఉన్నాయి. ఆయా సంస్ధలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ తో పాటు పారామిలటరీ బలగాలకు చెందిన రూ.65 వేల కోట్ల విలువైన 66 ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. సదరు కంపెనీలు ఈ ఏడు కంపెనీలు రీసెర్చ్, ఇన్నోవేషన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి మోడీ కోరారు. భవిష్యత్ టెక్నాలజీకి మీరు నాయకత్వం వహించాలని, పరిశోధకులకు సరికొత్త అవకాశాలనివ్వాలని సూచించారు. ఈ దిశగా ఉనికిలోకి వచ్చే స్టార్టప్‌లనూ ఈ ఏడు కంపెనీలు తమలో కలుపుకోవాలని తెలిపారు.