మీ ఫోన్ హ్యాక్ అయిందో.. లేదో తెలుసుకోండి !
1 min readపల్లెవెలుగు వెబ్: కంప్యూటర్ వైరస్, ట్రోజన్స్, స్పైవేర్, రాన్సమ్ వేర్, యాడ్వేర్, వార్మ్స్, ఫైల్ లెస్ మాల్వేర్ ల సహాయంతో సైబర్ నేరస్తులు దాడులకు పాల్పడుతున్నట్టు డబ్ల్యూహెచ్వో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా దాడులకు మెషిన్ లెర్నింగ్ వినియోగిస్తున్నారు. వైరస్ ను మెయిల్స్ సాయంతో, లేదంట ఆఫర్లు ఇస్తామంటూ పాప్ అప్ యాడ్స్ పంపిస్తారు. యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకునే ముందు వాటి వివరాలు చెక్ చేసుకోవాలి.
ఇలా తెలుసుకోండి :
- మీ ఫోన్ చార్జ్ చేస్తుంటే వెంటనే కట్ అవ్వడం, మీ ఫోన్ కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు, మెసేజ్ లు రావడం, మీ అనుమతి లేకుండా యాప్స్ కొనుగోలు చేయడం.
- కంటన్యూగా మీ ఫోన్ కు యాడ్స్ వస్తున్నా యాడ్ వేర్ మీ ఫోన్ ను అటాక్ చేసినట్టు గుర్తించాలి.
- మాల్వేర్, ట్రోజన్ మీ స్మార్ట్ ఫోన్ ఉపయోగించి స్పామ్ టెక్స్ట్ , మెసేజ్ లను మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నావారికి సెండ్ చేస్తుంటాయి. మీ కాంటాక్ట్ ఫోల్డర్ లోని గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించినట్టు గుర్తించాలి.
- స్మార్ట్ ఫోన్ పనితీరు బాగా తగ్గిపోతుంది.
- మీ స్మార్ట్ ఫోన్ లోకి కొత్త యాప్ లను వైరస్ , మాల్వేర్ లు డౌన్ లోడ్ చేస్తుంటాయి.
- యాప్ లు, మెసేజ్ ల వల్ల మీ డేటా మొత్తం అయిపోతుంది.
- బ్యాటరీ లైఫ్ టైమ్ తగ్గిపోతుంటుంది.