ఏపీ సీఎం జగన్ గణపతిసచ్చిదానందస్వామి ఆశ్రమం సందర్శన!
1 min read
పల్లెవెలుగువెబ్, విజయవాడ: విజయవాడ పడమట దత్తనగర్లోని గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని ఏపీ సీఎం జగన్ సోమవారం సందర్శించారు. ముందుగా ఆశ్రమంలో కొలువై ఉన్న మరకత రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం ఆశ్రమ పీఠాధిపతి సచ్చిదానందస్వామితో పలు అంశాలపై సమీక్షంచి ఆయన స్వామిజీ ఆశిస్సులు స్వీకరించారు. సీఎం జగన్ వెంట ఎంపీ విజయసాయిరెడ్డి, తితిదే చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.