ఆయన మద్యం సేవిస్తారని ఎందుకు ప్రశ్నించరు ?
1 min readపల్లెవెలుగు వెబ్: ఓ సీనియర్ నటుడి వ్యాఖ్యలపై బుల్లితెర యాంకర్ అనసూయ మండిపడ్డారు. తన డ్రెస్సింగ్ స్టైల్ పై కామెంట్ చేయడం పట్ల ఘాటుగా స్పందించింది. సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయింది. నా డ్రెస్సింగ్ స్టైల్ గురించి ఓ సీనియర్ నటుడి కామెంట్లను ఇప్పుడే చూశా. నటుడిగా అపారమైన అనుభవం ఉన్న ఆయన అలా మాట్లాడటం బాధ కలిగించింది. దుస్తులు ధరించటమనేది వ్యక్తిగత అంశం. ఎవరికి నచ్చిన దుస్తులు వారు వేసుకుంటారు. ఒక్కోసారి వృత్తిపరంగా విభిన్న దుస్తులు ధరించాల్సి ఉంటుంది. సోషల్ మీడియా అనవసరమైన విషయాల్ని హైలెట్ చేస్తుంది. అదే మీడియా, ఆ నటుడు మద్యం సేవిస్తారని.. చిరిగిన బట్టలు ధరస్తారని, ఆన్ స్క్రీన్ మీద మహిళల్ని కించపరిచే విధంగా ప్రవర్తిస్తారని చెప్పకపోవడం ఆశ్చర్యపడాల్సిన విషయం` అంటూ అనసూయ ఫైర్ అయింది. అయితే.. ఆ కామెంట్ చేసిన సీనియర్ నటుడు ఎవరో చెప్పకపోవడం గమనార్హం.