అధిక వడ్డీ ఆశ.. 10 కోట్లు స్వాహా !
1 min readపల్లెవెలుగు వెబ్: హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ ఆశజూపి 10 కోట్లు వసూలు చేశాడో వ్యక్తి. నెలనెలా అధిక వడ్డీ చెల్లిస్తూ.. కొన్ని నెలల తర్వాత కనిపించకుండా వెళ్లిపోయాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ లోని బాచుపల్లిలో ఉంటున్నాడు. బాల్యమిత్రుడితో కలిసి కూకట్ పల్లిలో డిపాజిట్లు సేకరించడం మొదలుపెట్టాడు. అధిక వడ్డీ ఆశచూపాడు. నెలకు 6 వేల నుంచి 10 వేల వరకు వడ్డీ చెల్లించాడు. ట్రేడింగ్ లో పెట్టుబడి పెట్టాడు. లాభాలతో సంబంధం లేకుండా వడ్డీ చెల్లించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు భారీ ఎత్తున అతడి కంపెనీలో డిపాజిట్లు చేశారు. కొన్ని రోజులుగా వడ్డీ బ్యాంక్ అకౌంట్లలో జమకాకపోవడంతో నిలదీశారు. త్వరలో మొత్తం సెటిల్ చేస్తానని హామీ ఇచ్చాడు. కొన్నిరోజుల తర్వాత కనిపించకుండా పోయాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.