సైనికులు ఉగ్రవాదులతో పోరాడుతుంటే.. క్రికెట్ మ్యాచ్ అవసరమా ?
1 min readపల్లెవెలుగు వెబ్: జమ్మూ-కశ్మీరులో సైనికులు ఉగ్రవాదులతో పోరాడుతూ అమరులవుతూ ఉంటే, భారత్-పాక్ క్రికెట్ జట్లు క్రికెట్ మ్యాచ్ ఆడటం ఏంటని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. అక్టోబరు 24న టీ20 మ్యాచ్ ఆడటం పై తనదైన స్టైల్లో విమర్శలు చేశారు. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలపైనా, లడఖ్‌లో చైనా తిష్ఠ వేయడంపైనా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడటం లేదన్నారు. చైనా గురించి మాట్లాడాలంటే మోదీకి భయం అన్నారు. జమ్మూ-కశ్మీరులో వివిధ ఆపరేషన్స్‌లో తొమ్మిది మంది సైనికులు ఇటీవల అమరులయ్యారన్నారు. ఇటువంటి సమయంలో అక్టోబరు 24న పాకిస్థాన్‌తో భారత్ టీ 20 మ్యాచ్ ఆడుతోందన్నారు. ‘మన సైనికులు అమరులయ్యారు. మీరు టీ20 ఆడతారా? పాకిస్థాన్ రోజూ భారత దేశ ప్రజలతో కశ్మీరులో 20-20 ఆడుతోంది’ అన్నారు. ఉగ్రవాదులు కశ్మీరులో సామాన్యులను చంపుతుండటం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనన్నారు.